నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

June 27, 2019


img

సీనియర్ నటి, దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి కాంటినెంటల్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా విజయ నిర్మల అక్కడే చికిత్స పొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల ఏడేళ్ల వయసులోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. మత్య్సరేఖ సినిమాతో తమిళంలో మొదట బాలనటిగా నటించిన విజయ నిర్మల తెలుగులో పాండురంగ మహత్యం సినిమాలో నటించారు. 

సాక్షి సినిమాతో తొలిసారి సూపర్ స్టార్ కృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నార్ విజయ నిర్మల. ఆ సినిమా నుండి దాదాపుగా వారిద్దరు కలిసి 47 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో 200 పైగా సినిమాల్లో నటించారు విజయ నిర్మల. మీనా సినిమాతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయ నిర్మల 44 సినిమాలకు డైరక్షన్ చేసి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్నారు. విజయకృష్ణ బ్యానర్ పై 15 సినిమాల దాకా నిర్మించారు.

విజయ నిర్మల మరణ వార్తతో తెలుగు సిని పరిశ్రమ షాక్ కు గురైంది. విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తి ఆయనతో విడిపోయి కృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మలకు నరేష్ ఒక్కడే సంతానం. ప్రస్తుతం ఆయన 'మా' అధ్యక్షుడిగా ఉన్నారు.       


Related Post

సినిమా స‌మీక్ష