బిగ్ బాస్ లో లాస్య.. అంతా ఉత్తిత్తే..!

June 26, 2019


img

స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి అంతా సిద్ధమైనట్టే అని తెలుస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. ఈసారి బుల్లితెర యాంకర్స్ శ్రీముఖి, ఉదయభాను, లాస్య వంటి వారు బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా ఉంటారని తెలుస్తుంది. శ్రీముఖి, ఉదయ భానుల పరిస్థితి ఏమో కాని యాంకర్ లాస్యకు 30 లక్షల రెమ్యునరేషన్ తో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.     

ఆ నోటా ఈ నోటా పడి లాస్యకు ఈ వార్తలు తెలిశాయి. అయితే తన మీద వస్తున్న ఈ వార్తలపై షాకింగ్ కామెంట్ చేసింది లాస్య. తనకు 30 లక్షల రెమ్యునరేషన్ ఇస్తే తప్పకుండా బిగ్ బాస్ కు వెళ్తానని. ప్రస్తుతం తనకు చిన్నబాబు ఉన్నాడని టైం మొత్తం బాబుతోనే సరిపోతుందని అన్నది లాస్య. తను బిగ్ బాస్ కంటెస్టంట్ గా వెళ్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని ఫేక్ అని తేల్చి చెప్పింది లాస్య. ఈ ఏడాది మొత్తం పూర్తిగా బాబు గడపాలని అనుకుంటున్నట్టు తెలిపిన లాస్య నెక్స్ట్ టైం కుదిరితే చూద్దామని అన్నది.     

 


Related Post

సినిమా స‌మీక్ష