విజయ్ రష్మిక ఏంటి మ్యాటర్..!

June 26, 2019


img

టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ రష్మికల మధ్య ఉన్నది స్నేహమేనా ఇంకా ఏదైనా ఉందా..? అదేంటి ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే గీతా గోవిందంతో హిట్ కొట్టిన ఈ జంట ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. ఇద్దరి ఆన్ స్క్రీన్ రిలేషనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా సీరియస్ రిలేషన్ నడుస్తుందని టాక్. అదెలా ఓ హీరో హీరో సినిమాతో సంబంధం లేకుండా తరచు కలుస్తుంటే కచ్చితంగా ఆ డౌటే వస్తుంది.

విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడ ప్రత్యక్షమవుతుంది. మొన్నామధ్య మహేష్ మహర్షి సక్సెస్ పార్టీలో విజయ్ తో రష్మిక కూడా పాల్గొంది. మహేష్ ఇంట్లో జరిగిన ఈ పార్టీకి రష్మికకు ఏం సంబంధం విజయ్ తో పాటే ఆమె అక్కడకు వెళ్లిందట. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ పార్టీలో కూడా విజయ్ పాల్గొనగా రష్మిక కూడా ఈ పార్టీలో ఉంది. విజయ్ రష్మిక వాట్ ఈజ్ ద మ్యాటర్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.   

కన్నడ భామ రష్మిక మందన్న అక్కడ హీరో రోహిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. విజయ్ వల్లే వాళ్లిద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష