పని పాట లేని వాళ్లే అలా చేస్తారు..!

June 26, 2019


img

క్రేజీ హీరోయిన్ రకుల్ కు ఈమధ్య ట్రోలర్స్ బెదడ బాగా ఎక్కువైందని చెప్పొచ్చు. మిగతా హీరోయిన్స్ ఏం చేసినా పట్టించుకోని కొందరు రకుల్ ఏ కాస్టూం వేసుకుంటుంది.. ఎలాంటి ఫోటో పెడుతుంది అన్న దాని మెద ఫోకస్ చేస్తున్నారు. మొన్నామధ్య రకుల్ కాస్టూం మీద జరిగిన రచ్చ అందరికి తెలిసిందే. ఇదిలాఉంటే తన మీద వచ్చే ట్రోల్స్ ను తాను అసలు పట్టిచుకోనని అంటుంది రకుల్. పని పాటా లేని వాళ్లు అలా చేస్తుంటారని వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది రకుల్.    

ఫ్రీ డేటాతో పని పాటా లేని వాళ్లే ఇలా ట్రోల్స్ చేసుకుంటూ కూర్చుకుంటారని చెప్పుకొచ్చింది రకుల్. నా తల్లిదండ్రులు, స్నేహితులకు అభ్యంతరం లేనప్పుడు తాను సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పెట్టాలని ఎందుకు భయపడాలని అంటుంది రకుల్. అందరిని మెప్పించే అవసరం లేదు కాబట్టి ట్రోలర్స్ ను పట్టించుకోకుండా ఉంటే సరి అంటుంది ఈ అమ్మడు. ఈమధ్య తెలుగులో ఛాన్సులు తగ్గినట్టు అనిపించిన రకుల్ మళ్లీ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది. Related Post

సినిమా స‌మీక్ష