బేబీ కోసం నిద్రలేని రాత్రులు..!

June 26, 2019


img

నందిని రెడ్డి డైరక్షన్ లో సమంత లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ఓ బేబీ. సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమా జూలై 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో 70 ఏళ్ల బామ్మ సడెన్ గా 25 ఏళ్ల పడుచు పిల్లగా మారితే ఎలా ఉంటుందో అదే కథతో వస్తుంది. అయితే ఈ సినిమా ఓకే చెప్పిన తర్వాత షూటింగ్ ఇంకా 3 రోజులు ఉందన్నప్పుడు సమంతకు రాత్రుళ్లు నిద్ర పట్టలేదట.

పాత్ర ఎలా చేయాలనే ఆలోచనతో రాత్రి పడుకోకుండా హోం వర్క్ చేసిందట. అలా చేసింది కాబట్టే సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓ బేబీ ట్రైలర్ తోనే ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ సమంత నటన గురించి అందరు మెచ్చుకునేలా ఉంటుందట. పెళ్లి తర్వాత సినిమాల స్పీడు పెంచిన సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది. మరి సమంత ఇంత కష్టపడి చేసిన ఓ బేబీ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష