చిరు.. కొరటాల ముహుర్తం ఫిక్స్.!

June 26, 2019


img

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహా రెడ్డి షూటింగ్ పూర్తి చేసుకుంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్ నగర్ టాక్. అక్టోబర్ లో మొదలు పెట్టి 2020 మార్చిలో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.  

భరత్ అనే నేను తర్వాత కొద్ది పాటి గ్యాప్ తీసుకున్న కొరటాల శివ చిరు కోసం ఓ సూపర్ స్టోరీ సిద్ధం చేశాడట. కొణిదెల ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా కూడా నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా అనుష్క, శృతి హాసన్ ల పేర్లు వినపడుతున్నాయి. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సూపర్ హిట్లు కొడుతున్న కొరటాల శివ చిరు సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష