నా క్యారక్టర్ అది కాదు..!

June 24, 2019


img

మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఎఫ్-2 హిట్ తో జోష్ అందుకున్న తమన్నా ఈమధ్య బాలీవుడ్ లో కామోషి, అభినేత్రి 2 సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాతో పాటుగా రాజు గారి గది 3 సినిమాలో నటిస్తుంది అమ్మడు. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో తమన్నాని నెగటివ్ రోల్ అన్న వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను ఖండించింది తమన్నా.

సైరాలో తనది స్పెషల్ రోల్ అని.. అది నెగటివ్ రోల్ అంటూ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారో తనకు అర్ధం కావట్లేదని అంటుంది తమన్న. బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో అలరించిన తమన్నా సైరాలో కూడా అలాంటి పాత్రలో నటిస్తుందట. తెలుగులో వరుస ఛాన్సులు పట్టేస్తున్న తమన్నా మరో రెండు మూడేళ్లు ఫుల్ ఫాంలో ఉండేలా కనిపిస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష