బిజినెస్ లో సరిలేరు నీకెవ్వరు

June 24, 2019


img

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తర్వాత చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్య ముహుర్త కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. షూటింగ్ కు వెళ్లకముందే సరిలేరు నీకెవ్వరు సినిమా బిజినెస్ అదరగొడుతుంది.   

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి వారు 16.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారట. మహర్షి సినిమా 12 కోట్లకు శాటిలైట్ అవగా సరిలేరు నీకెవ్వరు ఏకంగా 4 కోట్లు అధికంగా రేటు పలికింది. టైటిల్ కు తగినట్టుగానే శాటిలైట్ రైట్స్ లో కూడా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు అనేలా రికార్డులు కొల్లగొడుతున్నాడు. సూపర్ హిట్ డైరక్టర్ సూపర్ స్టార్ కలిసి చేస్తున్న ఈ సినిమాకు ఈ మాత్రం బిజినెస్ జరగకపొతే ఎలా అంటున్నారు ట్రేడ్ వర్గాలు.Related Post

సినిమా స‌మీక్ష