వాల్మీకి ప్రీ టీజర్.. వావ్ అనిపించిన వరుణ్ తేజ్..!

June 24, 2019


img

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న సినిమా వాల్మీకి. హారీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. తమిళ నటుడు అధర్వ ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా నుండి ప్రీ టీజర్ రిలీజైంది. 

ఇక ఈ సినిమా ప్రీ టీజర్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ మాసీ లుక్స్ తో అదరగొట్టాడు. ఇదవరకు ఇమేజ్ ఏమాత్రం కనబడకుండా వాల్మీకిలో వరుణ్ తేజ్ పాత్ర కనిపిస్తుంది. టీజర్ లోనే ఈ విధంగా అదరగొట్టాడంటే ఇక సినిమాలో వరుణ్ తేజ్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తాడని చెప్పొచ్చు. 18 సెకన్ల టీజర్ తోనే వాల్మీకి సినిమాపై అంచనాలు పెంచేలా చేశారు. రొటీన్ కథలు కాకుండా వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. మరి వాల్మీకి వరుణ్ తేజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.    





Related Post

సినిమా స‌మీక్ష