ప్రతిరోజు పండుగే.. సాయి తేజ్ డేరింగ్ డెశిషన్..!

June 24, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రీసెంట్ గా వచ్చిన చిత్రలహరి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ సినిమా కోసం తన పేరులోని ధరం తీసేశాడు ఈ హీరో. ప్రస్తుతం సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా మారాడు. తన తర్వాత సినిమా మారుతి డైరక్షన్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. భలే భలే మగాడివోయ్ నుండి మారుతి తన ప్రతి సినిమాలో హీరోకో, హీరోయిన్ కో ఏదో ఒక రోగం అంటకట్టి సినిమాలు చేస్తున్నాడు.

లాస్ట్ ఇయర్ శైలజా రెడ్డి మారుతికి పెద్ద షాకే ఇచ్చింది. అందుకే ఈసారి పక్కా హిట్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రచారం లో ఉన్న రాశి ఖన్నా కెరియర్ కూడా అంత ఆశాజనకంగా లేదు. తొలిప్రేమ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. మరి ఇలాంటి కాంబినేషన్ లో సాయి తేజ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రతిరోజు పండుగ అంటూ ప్రచారం లో ఉన్న ఈ సినిమా చేయడం సాయి తేజ్ డేరింగ్ డెశిషన్ అని అంటున్నారు. అయితే మారుతి మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష