బుర్రకథ ట్రైలర్.. విషయం ఉన్నట్టే ఉంది..!

June 24, 2019


img

సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ అలియాస్ ఆదిత్య హీరోగా డైమండ్ రత్న బాబు డైరక్షన్ లో వస్తున్న సినిమా బుర్ర కథ. మొన్నామధ్య టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజైంది. ఒక మనిషిలో రెండు బుర్రలు ఉంటే అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది. ఒకసారి ఒకళా మరోసారి మరోళా ప్రవర్తించే హీరోకి ఎన్ని కష్టాలు వచ్చాయి. వాటి నుండి అతను ఎలా తప్పించుకున్నాడు అన్నది సినిమా కథ.

ముఖ్యంగా డైలాగ్ రైటర్ అయిన రత్న బాబు బుర్రకథ డైలాగ్స్ బాగా రాశాడని అనిపిస్తుంది. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. సాయి కార్తిక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్ గా నటించారు. ఈ నెల 28న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అయినా ఆది సాయి కుమార్ ను హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందో లేదో చూడాలి.    

Related Post

సినిమా స‌మీక్ష