నితిన్ 'రంగ్ దే'.. టాప్ గేర్ వేశాడు..!

June 24, 2019


img

యువ హీరో నితిన్ కెరియర్ టాప్ గేర్ వేశాడు. శ్రీనివాస కళ్యాణం ఫెయిల్యూర్ తో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నితిన్ వరుస సినిమాలతో షాక్ ఇస్తున్నాడు. ఈమధ్యనే ఛలో డైరక్టర్ వెంకీ కుడుములతో భీష్మ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లిన నితిన్ ఆదివారం చంద్రశేఖర్ ఏలేటి సినిమా ముహుర్తం పెట్టుకున్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక సోమవారం కూడా మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు నితిన్. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న వెంకీ అట్లూరి మూవీ పోస్టర్ వదిలాడు. నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమాకు రంగ్ దే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించడం విశేషం. మహానటి తర్వాత తమిళంలో వరుస స్టార్ సినిమాలు చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంది. మరి నితిన్, కీర్తి సురేష్ ల జోడీతో వెంకీ అట్లూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష