ఆరెక్స్ భామతో అరుంధతి-2

June 22, 2019


img

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో కోడి రామకృష్ణ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అరుంధతి. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. జేజమ్మగా అనుష్కకు ప్రేక్షక నీరాజనాలు అందించారు. అప్పటివరకు కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే ఉన్న అనుష్క ఫీమేల్ లీడ్ సినిమాలకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

ఈ క్రమంలోనే అనుష్క రుద్రమదేవి సినిమా కూడా చేసింది. ఇదిలాఉంటే అరుంధతి సీక్వల్ గా అరుంధతి 2 సినిమా వస్తుంది. అయితే ఇది చేసేది అరుంధతి టీం కాదు హీరోయిన్ గా అనుష్క కూడా చేయట్లేదు. ఆరెక్స్ 100తో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ అరుంధతి 2లో నటిస్తుంది. శ్రీ శంఖుచక్ర ఫిలంస్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా అరుంధతి పేరుని నిలబెడుతుందో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష