బన్ని బావకి కానుక అంటూ నవదీప్ ఏం చేశాడంటే..!

June 22, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు యువ హీరో నవదీప్ దగ్గర నుండి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ అందబోతుంది. ఆర్య 2లో బన్ని, నవదీప్ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు. అప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. రీసెంట్ గా నవదీప్ స్టార్ట్ చేసినై 'సి' స్పేస్ ను అల్లు అర్జున్ వచ్చి ఓపెన్ చేశాడు. ఇదిలాఉంటే బన్ని మీద ప్రేమతో ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాడు నవదీప్. అదేంటి అంటే అల్లు అర్జున్ రుద్రమదేవి సినిమాలో వేసిన గోన గన్నారెడ్డి బొమ్మ గిఫ్ట్ గా ఇస్తున్నాడు.   


ఆ సినిమాలో అల్లు అర్జున్ ఎలా ఉన్నాడో అలాంటి బొమ్మ సిద్ధం చేయించాడు. బావకి ప్రేమతో ఓ చిరు కానుక అంటూ ట్విట్టర్ లో అల్లు అర్జున్ కు ట్యాగ్ చేశాడు. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ పోశించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు చాలా హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో బన్ని నటనకు మంచి పేరు వచ్చింది. సినిమా కమర్షియల్ గా నెగ్గడంలో బన్ని వేసిన ఆ రోల్ బాగా హెల్ప్ అయ్యింది. 



Related Post

సినిమా స‌మీక్ష