బాలయ్య కథ అది కాదట..!

June 22, 2019


img

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు విలన్ గా జగపతి బాబు ప్రస్తుతం ఏపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరహా పాత్రలో నటిస్తాడని అన్నారు.

అయితే చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ ఈ వార్తలను ఖండించారు. సినిమాలో బాలయ్య పోలీస్ రోల్ చేస్తున్నాడని రెండు షేడ్స్ ఉన్న హీరో పాత్ర ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మరోటి గ్యాంగ్ స్టర్ అని క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో హీరోయిన్ గా శ్రీయా శరణ్ సెలెక్ట్ అయ్యింది. ఆల్రెడీ గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల్లో బాలకృష్ణ, శ్రీయల జోడీ అలరించింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో జతకడుతున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష