వరల్డ్ కప్ వల్ల వాయిదా పడ్డ శంకర్..!

June 22, 2019


img

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్య రిలీజైన టీజర్, సాంగ్స్ అన్ని సినిమాపై క్రేజ్ తీసుకురాగా ఇస్మార్ట్ శంకర్ జూలై 12న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జర్గుతుంది. హాట్ ఫేవరెట్ గా ఇండియా జట్టు దూసుకెళ్తుంది.      

కచ్చితంగా ఇండియా ఫైనల్స్ కు వెళ్తుందని చెప్పొచ్చు. జూలై 14న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది. అందుకే జూలై 12న రిలీజయ్యే ఇస్మార్ట్ శంకర్ మీద కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ వాయిదా వేశారు. జూలై 12న రిలీజ్ కావాల్సిన ఇస్మార్ట్ శంకర్ జూలై 18కి వాయిదా వేశారని తెలుస్తుంది. అయితే జూలై 12న ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కలిసి నటిస్తున్న దొరసాని, సందీప్ కిషన్ నిను వీడని నీడను నేను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.   



Related Post

సినిమా స‌మీక్ష