ముద్దుకి ఇంత హంగామా ఎందుకు..!

June 19, 2019


img

బాలీవుడ్ భామ కియరా అద్వాని తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ లస్ట్ స్టోరీస్ అంటూ ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకున్న కియరా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఈమధ్య కోలీవుడ్ లో కూడా అమ్మడు ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ లో నటించింది కియరా అద్వాని.

షాహిద్ కపూర్ మేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాను అర్జున్ రెడ్డి మాత్రుక దర్శకుడు సందీప్ వంగ డైరెక్ట్ చేశాడు. సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో లిప్ లాక్ సీన్స్ పై ప్రతిసారి కియరాని ఇబ్బంది పెడుతున్నారట. తాను కేవలం ముద్దు మాత్రమే పెట్టానని అది కూడా నటనలో భాగమే అని.. అది అప్పుడే మర్చిపోతామని లిప్ లాక్ సీన్ ను ఎందుకు హైలెట్ చేసి ప్రశ్నలు అడుగుతారని మీడియాని కడిగి పారేసింది కియరా. లిప్ లాక్ చేయడం తప్పేం కాదని ఇక మీదట కూడా అవసరం ఉన్న సినిమాలకు తాను లిప్ ల్కా చేస్తానని చెప్పింది కియరా. తాను మూతి ముద్దులు పెడితే మీడియా హంగామా ఏంటో అనుకుందో ఏమో కాని లిప్ లాక్ సీన్స్ పై కియరా కస్సు బుస్సు అనేస్తుంది.  

 


Related Post

సినిమా స‌మీక్ష