సాయి ధరం తేజ్.. రాశి ఖన్నా.. సుప్రీం కాంబో రిపీట్..!

June 19, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి తర్వాత మారుతి డైరక్షన్ లో సినిమా షురూ చేశాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. సినిమాలో హీరోయిన్ గా నేల టిక్కెట్టు భామ మాళవిక శర్మ సెలెక్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే నేల టిక్కెట్టు ఫ్లాప్ కాబట్టి ఆమె పెద్దగా ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవలేదు. అందుకే మాళవిక శర్మ బదులుగా రాశి ఖన్నాను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఆల్రెడీ సాయి తేజ్ తో రాశి ఖన్నా సుప్రీం సినిమా చేసింది. ఆ సినిమా ఇద్దరికి మంచి హిట్ ఇచ్చింది. సూపర్ హిట్ కాంబో కాబట్టి ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు అలా ప్లాన్ చేశారట. మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి మెగా హీరోతో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు ప్రతిరోజు పండుగే అనే టైటిల్ ప్రచారంలో ఉంది.       Related Post

సినిమా స‌మీక్ష