RRR ఆగష్టు 15 గిఫ్ట్..!

June 18, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఈ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారట.  

ఆగష్టు 15న ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ ఇద్దరి ఫస్ట్ లుక్ తో పాటుగా సినిమా టైటిల్ కు సంబందించిన ఫుల్ ఫాం కూడా రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఓ పక్క స్వాతంత్ర దినోత్సవానికి ప్రభాస్ సాహో రిలీజ్ ప్లాన్ చేశాడు. అదేరోజు సైరా నరసింహా రెడ్డి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈసారి ఆగష్టు 15కి తెలుగు ప్రేక్షకులకు పండుగే అని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష