హీరోయిన్ లేకుండానే అఖిల్ సినిమా..!

June 18, 2019


img

అక్కినేని నట వారసుడు అఖిల్ తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 26న స్టార్ట్ కానుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదని ఫిల్మ్ నగర్ టాక్.

సినిమా షెడ్యూల్ మొత్తం పూర్తి అయిందట కాని హీరోయిన్, టైటిల్ ఈ రెండే పెండింగ్ ఉన్నాయట. అఖిల్ మొదటి సినిమా నుండి హీరోయిన్స్ విషయంలో ఈ కన్ ఫ్యూజన్ ఏర్పడింది. కొత్త వాళ్ల కన్నా ఆల్రెడీ ఫాంలో ఉన్న యువ హీరోయిన్స్ అయితేనే బెటర్ అని అనుకుంటున్నారట. అయితే మొదటి షెడ్యూల్ వరకు హీరోయిన్ అవసరం లేదట అందుకే ఆమె లేకుండానే కానిచ్చేస్తున్నట్టు తెలుస్తుంది.   Related Post

సినిమా స‌మీక్ష