మెగాస్టార్ రిలీజ్ చేసిన కౌసల్య కృష్ణమూర్తి టీజర్..!

June 18, 2019


img

కోలీవుడ్ లో హిట్టైన సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయమే. ముందు డబ్బింగ్ కు ట్రై చేస్తారు అక్కడ స్టార్ హీరోల సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. కాని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అయిన 96 తెలుగులో రీమేక్ అవుతుంటే ఇప్పుడు కణా సినిమా కూడా రీమేక్ అవుతుంది.

తెలుగులో రీమేక్ స్పెషలిస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న భీమనేని శ్రీనివాస్ కణా సినిమా రీమేక్ చేస్తున్నారు. కె.ఎస్ రామారావు డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పల్లెటూరి అమ్మాయి క్రికెటర్ అవ్వాలన్న కోరిక ఎలా ఫలించింది అన్న కథతో ఈ సినిమా వస్తుంది. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ అక్కడ స్పెషల్ రోల్ చేయగా ఇక్కడ కూడా ఆ రోల్ తనే చేస్తుండటం విశేషం. ఈరోజు ఈ సినిమా టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద రిలీజ్ చేశారు. టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించేలా ఉందని చిరు చెప్పడం విశేషం.  

Related Post

సినిమా స‌మీక్ష