పృధ్వికి మెగా షాక్ తగిలిందా..!

June 18, 2019


img

థర్టీ ఇయర్స్ పృధ్వి సినిమాల్లోనే కాదు ఈమధ్య రాజకీయాలకు సంబందించిన విషయాలను ప్రస్థావిస్తున్నాడు. ఏపి ఎలక్షన్స్ లో వైసిపికి సపోర్ట్ గా జగన్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ మాట్లాడిన పృధ్వి టిడిపితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. పవన్ ఒక్కడి మీదే కాదు మెగా ఫ్యామిలీ మీద కూడా కామెంట్స్ చేశాడు పృధ్వి. టాలీవుడ్ కు మెగా ఫ్యామిలీ చేసింది ఏది లేదు అన్నట్టుగా మాట్లాడాడు థర్టీ ఇయర్స్ పృధ్వి.

ఇప్పుడు అదే తన కొంప ముంచేలా చేస్తుంది. మెగా హీరోల సినిమాల్లో పృధ్విని స్కిప్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో థర్టీ ఇయర్స్ పృధ్వి పాత్ర కూడా ఉండాల్సిందట. కాని బన్ని అతని పాత్ర కట్ చేయించినట్టు తెలుస్తుంది. మరి రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అలాంటిది తమకి వ్యతిరేకంగ ఉన్నాడని ఓ నటుడికి అవకాశాలు రాకుండా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే ఇది కేవలం రూమరేనా లేక నిజంగా మెగా హీరోలు అలా చేస్తున్నరా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష