నాగ చైతన్యతో 'ఫిదా' కాంబో..!

June 18, 2019


img

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల అంతా కొత్త వాళ్లతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే తను తర్వాత తీసే సినిమా గురించి ఓ సర్ ప్రైజ్ న్యూస్ బయటకు వచ్చింది. అక్కినేని నాగార్జున, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల ఓ క్రేజీ సినిమా చేస్తున్నాడట. సాయి పల్లవి తెలుగు డబ్యూ మూవీ ఫిదా శేఖర్ కమ్ముల డైరక్షన్ లోనే తెరకెక్కింది. అందుకే సాయి పల్లవి శేఖర్ కమ్ముల సినిమా అంటే వెంటనే ఓకే చెప్పేసిందట. 

శేఖర్ కమ్ముల నాగ చైతన్య కోసం కొన్నాళ్ల క్రిందట ఓ కథ చెప్పాడట. ఆ కథని కొద్దిగా మార్చి ఇప్పుడు సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. లవర్ బోయ్ గా చైతు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి ఈ ఇద్దరు కలిసి చేసే ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల మార్క్ మ్యాజిక్ రిపీట్ అయితే మళ్లీ ఫిదా లానే చైతు, సాయి పల్లవిల సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.Related Post

సినిమా స‌మీక్ష