శర్వానంద్ 2 నెలలు బ్రేక్..!

June 18, 2019


img

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శర్వానంద్ హీరోగా సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ చిన్న యాక్సిడెంట్ వల్ల శర్వానంద్ కు గాయాలయ్యాయి. నిన్న హైదరాబాద్ లో శర్వానంద్ కు సర్జరీ కూడా జరిగినట్టు తెలుస్తుంది.

అయితే ఈ గాయం వల్ల సినిమాకు బ్రేక్ ఇచ్చారు. డాక్టర్స్ మాత్రం శర్వానంద్ కు 2 నెలలు కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలని చెప్పారట. త్వరగా పూర్తి చేసి దసరాకి 96 రిలీజ్ చేద్దామని అనుకున్నారు కాని 2 నెలలు బ్రేక్ వచ్చింది కాబట్టి రిలీజ్ వాయిదా పడుతుంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిషా నటించిన 96 మూవీ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.   


Related Post

సినిమా స‌మీక్ష