బంగార్రాజు కాదు మనం-2..!

June 17, 2019


img

కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో కింగ్ నాగార్జున తెరకెక్కించే సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీ క్వెల్ గా వస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా మన్మథుడు 2 రిలీజ్ తర్వత ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. సినిమాలో నాగార్జున తాత పాత్రలో నటిస్తుండగా నాగ చైతన్య మనవడిగా కనిపిస్తాడట. నాగ్ కు జోడీగా రమ్యకృష్ణ, చైతుకి జతగా సమంత మరోసారి అలరిస్తారట.  

అయితే ఈ సినిమాలో మిగతా అక్కినేని కుటుంబ హీరోలు కనిపిస్తారట. అందుకే ఈ సినిమా బంగార్రాజు అని కాకుండా మనం సీక్వల్ గా చెబుతున్నారు. సినిమా కథ కూడా సోగ్గాడే చిన్ని నాయనా కథకు సంబంధం లేకుండా ఉంటుందట. విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించి సూపర్ సక్సెస్ అందుకుంది. మరి బంగార్రాజు సినిమా మనం 2 అంటున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష