కల్కి డైరక్టర్ ధనుష్ మూవీ..?

June 15, 2019


img

అ! సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ప్రశాంత్ వర్మ క్వీన్ రీమేక్ తో పాటుగా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమా మీద ఆసక్తి కలిగేలా చేసింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కోసం ఓ డిఫరెంట్ స్టొరీ సిద్ధం చేశాడట.

కల్కి హిట్ కొడితే ధనుష్ కు తన కథ చెప్పేందుకు ప్రయత్నిస్తాడని తెలుస్తుంది. ధనుష్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ ధనుష్ తెలుగులో స్ట్రైట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే ప్రశాంత్ వర్మ కథ బాగుంటే తప్పకుండా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్టే. చేసేది తమిళ సినిమాలే అయినా తెలుగులో కూడా ధనుష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో ధనుష్ సినిమా ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.  

 


Related Post

సినిమా స‌మీక్ష