నయనతార చేయాల్సిన గేమ్ ఓవర్..!

June 15, 2019


img

అశ్విన్ శరవణన్ డైరక్షన్ లో తాప్సీ లీడ్ రోల్ లో ఈ శుక్రవారం రిలీజైన సినిమా గేమ్ ఓవర్. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమాతో తాప్సీ మరో హిట్ తన ఖాతాలో వేసుకుందని చెప్పొచ్చు. అయితే కోలీవుడ్ లో ఇలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయనతార. గేమ్ ఓవర్ తాప్సీ ప్లేస్ లో నయనతారను ఊహించుకుంటే ఎలా ఉంటుంది.

డైరక్టర్ అశ్విన్ శరవణన్ ఈ సినిమాను ముందు నయనతారతోనే తీయాలని అనుకున్నాడట. కాని సినిమా కథ హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ అలిగేషన్స్ రావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. గేం ఓవర్ సినిమాకు నయన్ తో మూడు రోజులు షూటింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఫైనల్ గా స్క్రిప్ట్ లో టాటూ అనే కాన్సెప్ట్ యాడ్ చేసి తాప్సీతో తీసి హిట్ కొట్టారు. నయనతార చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.    



Related Post

సినిమా స‌మీక్ష