గేమ్ ఓవర్ : రివ్యూ

June 14, 2019


img

రేటింగ్ : 2.75/5 

కథ :

గేమ్ ప్లానర్ అయిన స్వప్న (తాప్సీ) చీకటి అంటే బయటపడుతుంది. ఆమె ఓ టాటూ వేయించుకుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. అదే సమయంలో మరో పక్క వరుసగా అమ్మాయిలను దారుణంగా హత్య చేస్తుంటారు కొందరు. అసలు ఆ హత్యలు చేస్తున్నది ఎవరు..? వాళ్లకి స్వప్నకి సంబంధం ఏంటి..? వాళ్ల నుండి స్వప్న ఎలా తప్పించుకుంది అన్నది సినిమా కథ.   

విశ్లేషణ :

గేమ్ ప్లానర్ కథ చాలా కొత్తగా ఉంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ కథా, కథనాలతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి సినిమాలకు ఎలాంటి స్క్రీన్ ప్లే ఉండాలో దానికి తగినట్టుగా రాసుకున్నాడు. ఇక నటీనటుల ప్రతిభ కూడా దీనికి సహకరించారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది.  

సినిమా చూసిన ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమాల ప్రేరణ అనిపిస్తుంది. అయితే దర్శకుడు మాత్రం ఎంచుకున్న కథను మంచి సన్నివేశాలతో మెప్పించాడు. అయితే క్లైమాక్స్ మాత్రం ఆడియెన్స్ అందరికి అర్ధమయ్యేలా వివరణ ఇవ్వడం కాస్త అసంతృప్తి అనిపిస్తుంది. సినిమా రన్ టైం కూడా తక్కువ ఉండటం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 

రెగ్యులర్ సిని లవర్స్ కన్నా సినిమా డిఫరెంట్ జానర్లు ఇష్టపడే వారికి గేం ఓవర్ బాగా నచ్చుతుంది. కథ కథనాల్లో దర్శకుడు ప్రతిభ మెచ్చుకోదగినది. 

నటన, సాంకేతిక వర్గం :

స్వప్న పాత్రలో తాప్సీ ది బెస్ట్ అనిపిచుకుంది. పింక్ సినిమా తర్వాత తాప్సీ గేమ్ ఓవర్ లో అదరగొట్టేసిందని చెప్పొచ్చు. వినోదిని వైద్యనాథన్ కూడా బాగా చేసింది. తాప్సీతో పాటుగా వినోదిని నటన కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అనీష్ కురువిల్లా కూడా బాగా చేశారు. సంచన నటరాజన్, రమ్య సుబ్రహ్మణ్యం మెప్పించారు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. వసంత్ సినిమాటోగ్రఫీ మెప్పించింది. రాన్ ఏతన్ యోహన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. అశ్విన్ శరవణన్ కథ, కథనాలు బాగున్నాయి. అయితే అక్కడక్కడ కాస్త ట్రాక్ తప్పినా ఫైనల్ గా గేం ఓవర్ ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. 

ఒక్కమాటలో :

తాప్సీ గేమ్ ఓవర్.. థ్రిల్ అవడం ఖాయం..!  



Related Post

సినిమా స‌మీక్ష