ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్న RRR

June 14, 2019


img

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారమరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం 3వ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది.

దుబాయ్ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా మినహా ట్రిపుల్ ఆర్ ఓవర్సీస్ రైట్స్ ను 65 కోట్లకు కొనేశారని తెలుస్తుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు రాజమౌళి. బాహుబలి తర్వాత వస్తున్న సినిమాగా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఓవర్సీస్ లోనే ఇలా ఉంటే ఇక ఇండియాలో ఈ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తను సృష్టించిన బాహుబలి రికార్డును తనే చెరిపేసేలా ఆర్.ఆర్.ఆర్ తో సూపర్ స్కెచ్ వేశాడు రాజమౌళి.   



Related Post

సినిమా స‌మీక్ష