టిక్ టాక్ టూ బిగ్ బాస్.. ఉప్పల్ బాలు ఛాన్స్ పట్టేశాడా..!

June 14, 2019


img

టిక్ టాక్ లో చాలా మంది ఫేమస్ అయ్యారు.. అవుతున్నారు. వారిలో ఉప్పల్ బాలు ఒకడు. టిక్ టాక్ అంటే ఉప్పల్ బాలు అనేలా చేసుకున్న అతను టిక్ టాక్ ఫాలోవర్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే అతనికి ఉన్న క్రేజ్ చూసి ఈటివి ప్లస్ లో ఓ కామెడీ సీరియల్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 3లో ఉప్పల్ బాలు హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తాడని టాక్.

ఓ యాప్ వల్ల అతని టాలెంట్ తో ఇంతమంది ఫాలోవర్స్, క్రేజ్ ఏర్పరచుకున్న ఉప్పల్ బాలు నిజంగానే బిగ్ బాస్ షోలో వస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో లాస్య, శ్రీముఖి, సింగర్ హేమచంద్ర, హీరో వరుణ్ సందేష్, రేణు దేశాయ్ వంటి వాళ్ల పేర్లు వినపడుతున్నాయి. మరి ఫైనల్ కంటెస్టంట్ లిస్ట్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.  



Related Post

సినిమా స‌మీక్ష