తనయులతో తారకానందం

June 14, 2019


img

యంగ్ టైగర్ ఈరోజు తన ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎన్.టి.ఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా తన ఇద్దరి కొడుకుల ఫోటోలను తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశాడు తారక్. అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు దిగిన ఫోటోతో పాటుగా భార్గవ్ రామ్ తో తారక్ ఉన్న పిక్ ఒకటి షేర్ చేశాడు. తారక్ తనయుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

నందమూరి ఫ్యాన్స్ కు తారక్ ఇచ్చిన ఈ స్పెషల్ సర్ ప్రైజ్ కు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ తో పాటుగా రాం చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో రియల్ హీరోస్ కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష