'సాహో' టీజర్.. ధూమ్ తెలుగు వర్షన్..!

June 13, 2019


img

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ సాహో. సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ అదరగొట్టింది. ఇన్నాళ్లు ధూమ్ లాంటి సినిమాలు తీయాలంటే బాలీవుడ్ దర్శక నిర్మాతలే సాధ్యం అనుకున్నాం కాని సాహోతో సీన్ మారబోతుంది. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోగా మరో సంచలనానికి సిద్ధమయ్యాడు.     

క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరిని సర్ ప్రైజ్ చేసేలా సాహో టీజర్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టేశారు. తెలుగులో ఈ స్థాయి సినిమా తీయడం మరోసారి ప్రభాస్ వల్లే అయ్యింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. టీజర్ దుమ్ముదులిపేయగా సినిమా కూడా అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు. 





Related Post

సినిమా స‌మీక్ష