మన్మథుడు-2 టీజర్.. రొమాంటిక్ నాగ్ అదరగొట్టాడు..!

June 13, 2019


img

2002 లో కింగ్ నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా మన్మథుడు. ఆ సినిమాకు సీక్వల్ గా మన్మథుడు-2 చేస్తున్నారు. చిలసౌ సినిమాతో సత్తా చాటిన డైరక్టర్ రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 17 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ గా మన్మథుడు 2 వస్తుంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మన్మథుడు పార్ట్ 1కి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ పార్ట్ 2 ఉంది. అంతేకాదు టైటిల్ జస్టిఫికేషన్ కోసం నాగ్ మన్మథుడిగా మారినట్టు ఉన్నాడు. మన్మథుడు 2 టీజర్ అదిరిపోయింది. అంతేకాదు ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ ఓన్లీ మేక్ లవ్ అంటూ చివరి డైలాగ్ తో హీరో క్యారక్టర్ ఇంటెన్స్ ఏంటన్నది తెలియచేశాడు దర్శకుడు రాహుల్ రవింద్రన్. 60 ఏళ్లు వస్తున్నా ఇంకా నాగార్జున కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. టీజర్ ఇంప్రెస్ చేయగా ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.   




Related Post

సినిమా స‌మీక్ష