బాలకృష్ణ కథ మారిపోయింది

June 12, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ తీసి చేతులు కాల్చుకున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా ఈవెంట్ లోనే బోయపాటి శ్రీను డైరక్షన్ లో తన నిర్మాణంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. కాని బయోపిక్ మిగిల్చిన నష్టాలకు భయపడిన బాలయ్య సినిమా నిర్మాణం తగదని సైలెంట్ అయ్యాడు. బోయపాటి సినిమాకు నిర్మాత కోసం వెయిటింగ్. ఇక ఈమధ్యలోనే కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు బాలకృష్ణ. 

జై సింహా తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న కథ వేరేది కాగా.. ప్రస్తుతం ఏపిలో ఉన్న పరిస్థితుల వల్ల ఆ కథ కష్టమని భావించి పరుచూరి మురళి ఇచ్చిన మరో కథను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. డైరక్టర్ రవి కుమార్ చేసినా సినిమా కథ మాత్రం పరుచూరి మురళి అందిస్తున్నట్టు తెలుస్తుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ పేరు వినపడుతుంది.  Related Post

సినిమా స‌మీక్ష