బన్ని త్రివిక్రం టార్గెట్ ఫిక్స్..!

June 12, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా పేతురాజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.

హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గా అలకనంద, నాన్న నేను అనేవి ప్రచారంలో ఉన్నాయి. ఈమధ్యనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టిన ఈ సినిమా 2020 సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. ఎట్టిపరిస్థితుల్లో సినిమా పొంగల్ వార్ లో దించేలా ప్లాన్ చేస్తున్నారట. దానికి తగినట్టుగానే షెడ్యూల్ వేసుకున్నారని తెలుస్తుంది. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాపై హిట్ కొట్టాలని చూస్తున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష