బిగ్ బాస్ కు బండ్ల కండీషన్స్..!

June 11, 2019


img

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 త్వరలో రాబోతుంది. హోస్ట్ గా అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా కింగ్ నాగార్జునని సెలెక్ట్ చేశారు. కంటెస్టంట్స్ విషయంలో కూడా ఈసారి చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. సీజన్ 1, 2 కన్నా ఎక్కువ మంది సెలబ్రిటీస్ ను 3వ సీజన్ కు తెస్తున్నారట. అందులో రేణు దేశాయ్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, తీన్మార్ సావిత్రి అందరు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ లో బండ్ల గణేష్ కూడా ఉన్నాడని తెలుస్తుంది.

బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులు కోరారట. అసలైతే కంటెస్టంట్స్ కే బిగ్ బాస్ నిర్వాకులు కండీషన్స్ పెడతారు కాని రివర్స్ లో బిగ్ బాస్ టీం కే కొన్ని కండీషన్స్ పెట్టాడట బండ్ల గణేష్. తనకు రెండు మూడు రోజులకు ఒకసారి ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వాలని.. ఇంకా కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఇవ్వాలని అడిగాడట. అయితే ఒక్కసారి హౌజ్ లోకి ఎంటర్ అయితే బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు అందుకే బండ్ల గణేష్ కండీషన్స్ కు బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పుకోలేదట.    Related Post

సినిమా స‌మీక్ష