మెగా హీరో కోసం నిర్మాతగా డైరక్టర్..!

June 11, 2019


img

డైరక్టర్ కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్యలతో వెంకీమామ సినిమా చేస్తున్నాడు. జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో బాబి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలాఉంటే ఇప్పుడు ఈ డైరక్టర్ నిర్మాతగా మారేందుకు సిద్ధమయ్యాడట. మెగా హీరో సాయి ధరం తేజ్ తో బాబి నిర్మాణంలో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడిగా అరుణ్ పవార్ పేరు ను సెలెక్ట్ చేశారట.

బెస్ట్ యాక్టర్స్ సినిమాతో దర్శకుడిగా మారిన అరుణ్ పవార్ సప్తగిరి హీరోగా వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా సప్తగిరితో వజ్రకవచధర గోవింద సినిమా చేశాడు. ఈ నెల 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అరుణ్ పవార్ చెప్పిన కథ నచ్చడంతో సాయి ధరం తేజ్ హీరోగా బాబి ప్రొడ్యూసర్ గా సినిమా ఓకే చేశారట. చిత్రలహరి హిట్ తో ఖుషిగా ఉన్న సాయి తేజ్ మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత అరుణ్ పవార్ సినిమా ఉంటుందట.  


Related Post

సినిమా స‌మీక్ష