హిట్ కాంబో రిపీట్ చేస్తున్న నిఖిల్

June 10, 2019


img

యువ హీరోల్లో ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తున్న హీరో ఎవరంటే అది నిఖిల్ సిద్ధార్థ్ అని చెప్పొచ్చు. వెరైటీ కంటెంట్ సినిమాలు చేస్తున్నా సరే అతనికి లక్ కలిసి రావడం లేదు. డీమానిటైజేషన్ టైంలో రిలీజైన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా సూపర్ హిట్ అయ్యింది. విఐ ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత మళ్లీ నిఖిల్ సినిమాలు పెద్దగా ఆడలేదు. 

లేటెస్ట్ గా నిఖిల్ నటించిన అర్జున్ సురవరం రిలీజ్ సంక్షోభం ఇంకా వీడలేదు. ఆ సినిమాపై దాదాపుగా నిఖిల్ కూడా ఆశలు వదులుకున్నట్టే అంటున్నారు. ఇదిలాఉంటే నిఖిల్ తనకు హిట్టిచ్చిన డైరక్టర్స్ ను రిపీట్ చేస్తున్నాడు. ఆల్రెడీ చందు మొండేటితో కార్తికేయ 2 స్టార్ట్ చేయగా త్వరలో విఐ ఆనంద్ డైరక్షన్ లో కూడా మరో సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి వారి సెకండ్ మూవీపై కూడా అంచనాలు బాగుంటాయి. మరి కార్తికేయ 2 సెట్స్ మీద ఉండగానే విఐ ఆనంద్ సినిమా స్టార్ట్ చేసే ఆలోచన్లో ఉన్నాడు నిఖిల్.   Related Post

సినిమా స‌మీక్ష