బన్ని కోసం కాజల్..!

June 10, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో నివేదా పేతురాజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ ఏంటంటే ఐటం సాంగ్ లో కాజల్ కనిపిస్తుందట.

ఆల్రెడీ పక్కా లోకల్ అంటూ ఓ ఊపు ఊపేసిన కాజల్ మళ్లీ ఐటం సాంగ్స్ జోలికి వెళ్లలేదు. దశాబ్ధ కాలంగా హీరోయిన్ గా ఉంటున్నా కాజల్ మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసింది మాత్రం జనతా గ్యారేజ్ లోనే. ఇప్పుడు ఆమెను మరో ఐటం సాంగ్ కు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకు అమ్మడు భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది. సినిమా టైటిల్ గా అలకనంద, నాన్న నేను అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.  Related Post

సినిమా స‌మీక్ష