సురేష్ ప్రొడక్షన్స్ లోగో.. ఆ ఇద్దరు పిల్లలు ఎవరంటే..!

June 10, 2019


img

మూవీ మొఘల్ రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. రామానాయుడు మరణం తర్వాత సురేష్ బాబు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఈమధ్య ఆయన నిర్మాణానికి దూరమయ్యారు. చిన్న సినిమాలకు సపోర్ట్ గా ఉన్నారు. లేటెస్ట్ గా స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా సురేష్ ప్రొడక్షన్స్ గురించి సర్ ప్రైజ్ న్యూస్ ఒకటి బయటపెట్టారు సురేష్ బాబు.

సురేష్ ప్రొడక్షన్స్ లోగోలో ఇద్దరు చిన్న పిల్లలు కనిపిస్తారు. వారిద్దరు ఎవరంటే తాను, వెంకటేష్ అని సీక్రెట్ బయటపెట్టారు. ఓ రోజు స్కూల్ నుండి వచ్చిన తనని, వెంకటేష్ ను ఎస్.పి అనే రెండు అక్షరాల మీద నిలబడమన్నారు. అలా తాను పి మీద.. వెంకటేష్ ఎస్ మీద నిలబడ్డాడు. వాటిని ఫోటో తీసి లోగో ఫిక్స్ చేశారు. అదేంటో తెలియదు కాని ఎస్ మీద నిలబడిన వెంకటేష్ స్టార్ అయ్యాడు. పి మీద నిలబడ్డ తను నిర్మాత అయ్యానని అన్నారు సురేష్ బాబు. మొదట తండ్రి దగ్గర ప్రొడక్షన్ ఖర్చులు రాస్తూ ఆ తర్వాత చిన్నగా నిర్మాత విధి విధానాలు తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.Related Post

సినిమా స‌మీక్ష