ఎన్.జి.కే రివ్యూ & రేటింగ్

May 31, 2019


img

రేటింగ్ : 2/5

కథ :

ఎం.టెక్ చేసిన నంద గోపాల కృష్ణ (సూర్య) ఎం.ఎన్.సి కంపెనీలో జాబ్ ను కూడా వదిలేసి వచ్చి ఆర్గానిక్ వ్యవహాసాయం చేస్తుంటాడు. ఊరిలో ప్రజల సమస్యల పట్ల యాక్టివ్ గా ఉండే ఎన్.జి.కే రాజకీయ నాయకుడికి ఉన్న బలమేంటో తెలుసుకుంటాడు. అలా రాజకీయాల్లోకి రావలని ఫిక్స్ అవుతాడు. ఓ ఎమ్మెల్యే దగ్గర చేరి పాలిటిక్స్ నేర్చుకుంటాడు. ఫైనల్ గా పార్టీ పెట్టి అధికారం చేజిక్కించుకుంటాడు. ఎన్.జి.కే అసలు పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాడు..? రాజకీయాల్లో నంద గోపాల్ ఎలాంటి మార్పు తీసుకు రావాలని అనుకున్నాడు..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

సెల్వ రాఘవన్ అనగానే 7/జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ సినిమాలు తీసిన అతనేనా ఎన్.జి.కే తీసింది అన్న డౌట్ రాక మానదు. సినిమా చాలా కన్ ఫ్యూజ్ గా చెప్పాలనుకున్న పాయింట్ కూడా సరిగా చెప్పలేని విధంగా తీశాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేశాడు.

క్లైమాక్స్ లో సూర్య స్పీచ్ తప్ప మ్యాటర్ ఏం లేదు. ముఖ్యంగా సాయి పల్లవితో సీన్స్ ఎందుకో వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు. రొటీన్ కథతో అంతకంటే రొటీన్ స్క్రీన్ ప్లేతో ఎన్.జి.కే వచ్చింది. కథ చెప్పే తరుణంలో దర్శకుడు ఎక్కడో ట్రాక్ తప్పేశాడని చెప్పొచ్చు. సినిమా అంతా గజిబిజిగా ఉంటుంది.

సినిమా ట్రైలర్ లో విషయం ఉన్నట్టుగా అనిపించినా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. తమిళ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉన్నా తెలుగు ఆడియెన్స్ కు మాత్రం ఇది రొటీన్ సినిమా అని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

యాక్టింగ్ పరంగా సూర్య నంద గోపాల కృష్ణ పాత్రలో మెప్పించాడు. అయితే దర్శకుడు సూర్యని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో సూర్య డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ల నటన జస్ట్ ఓకే అనేలా ఉంది. రకుల్ గ్లామర్ తో మెప్పించే ప్రయత్నం చేసినా సినిమాలో సాయి పల్లవి పెద్దగా ఆకట్టుకోలేదు. జగపతి బాబు తన పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ బాగుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం కూడా ఓకే. అయితే కథ కథనాల్లో దర్శకుడు పెద్దగా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఒక్కమాటలో :

ఎన్.జి.కే.. ఆకట్టుకోలేని ప్రయత్నం..! 



Related Post

సినిమా స‌మీక్ష