సమంత 'ఓ బేబీ' టీజర్..!

May 25, 2019


img

అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అదరగొడుతుంది. ఈమధ్యనే నాగ చైతన్యతో మజిలీ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న సమంత ఓ బేబీ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా అఫిషియల్ రీమేక్ గా ఓ బేబీ సినిమా వస్తుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ రెండు కలిసి నిర్మిస్తున్నారు.

సినిమాలో సీనియర్ నటి లక్ష్మి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. నాగ శౌర్య కూడా స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. 70 ఏళ్ల బామ్మ పాతికేళ్ల అమ్మాయిగా మారితే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కాన్సెప్ట్.. రిలీజ్ చేసిన టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాలో సమంత మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ తో మెప్పిస్తుందని చెప్పొచ్చు.   


Related Post

సినిమా స‌మీక్ష