ఎన్నికల ఫలితాలపై రాం చరణ్ రియాక్షన్ ఇది..!

May 25, 2019


img

ఏపి ఎలక్షన్స్ లో జనసేన కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా గాజువాక, భీమవరం రెండు ప్రాంతాల్లో పోటీ చేయగా రెండు చోట్ల ఓటమిపాలయ్యాడు. జనసేన ఓడినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగానే కామెంట్స్ చేస్తున్నారు. మద్యానికి, మనీకి మానవత్వం అమ్ముడుపోయిందని హైపర్ ఆది లాంటి పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. 

ఇక బాబాయ్ తరపున రాం చరణ్ ఏపి ఎలక్షన్స్  గురించి స్పందించాడు.. ఎన్నికల్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పనిచేసిన వారందరికి కృతజ్ఞతలు చెప్పిన రాం చరణ్.. గొప్ప నాయకుడు.. నాయకుడు అనిపించుకోవాలని అనుకోడు.. మార్పుని తీసుకొచ్చేందుకే ప్రయత్నించే వాడు అసలైన నాయకుడు.. పదవి ఏంటన్నది ముఖ్యం కాదు.. లక్ష్యమే ముఖ్యం.. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మద్ధతుగా ఉండి.. సేవ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఏపి ఎన్నికలు 2019 అనే హ్యాష్ ట్యాగ్ తో రాం చరణ్ ఫేస్ బుక్ కామెంట్ పెట్టారు.       Related Post

సినిమా స‌మీక్ష