సమంత 'ఓ బేబీ' ఫస్ట్ లుక్

May 22, 2019


img

పెళ్లి తర్వాత హీరోయిన్స్ పని అయిపోయిందని అనుకుంటారు కాని అక్కినేని కోడలు సమంత మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పెళ్లి తర్వాత అదే మునుపటి క్రేజ్ తో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంది. ఈమధ్యనే మజిలీ సూపర్ హిట్ తో మంచి ఫాంలో ఉన్న సమంత ఓ బేబీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలా మొదలైంది ఫేం నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొరియన్ మూవీకి రీమేక్.

ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి కూడా నటిస్తున్నారు. 70 ఏళ్ల బామ్మ అనూహ్యంగా 20 ఏళ్ల అమ్మాయిగా మారితే అన్న కథతో ఈ సినిమా వస్తుంది. సురేష్ ప్రొడక్షన్ తో పాటుగా ఈ సినిమాను మరో రెండు బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సమంత క్యూట్ లుక్స్ తో వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంది. చూస్తుంటే సమంత మళ్లీ ఓ బేబీతో హిట్ కొట్టేలా ఉంది.   



Related Post

సినిమా స‌మీక్ష