విజయ్ దేవరకొండ లవ్ బ్రేకప్..!

May 22, 2019


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ లతో పాటుగా ఫారిన్ మోడల్ ఇజబెల్ లీట్ నటిస్తుందని తెలుస్తుంది.

లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీలో విజయ్ లవ్ బ్రేకప్ అవుతుందట. అందుకే టైటిల్ గా కూడా బ్రేకప్ అని పెట్టబోతున్నారట. బ్రేకప్ యూత్ ఫుల్ టైటిల్ అది కూడా విజయ్ లాంటి యూత్ ఫుల్ హీరోకి పర్ఫెక్ట్ మ్యాచ్. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ ఆనంద్ డైరక్షన్ లో హీరో సినిమా ముహుర్తం పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష