మహర్షి మేకింగ్ వీడియో..!

May 21, 2019


img

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మే 9న రిలీజైన సినిమా మహర్షి. మొదటి షో నుండి సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. సినిమా రిలీజ్ వారం ముందునుండి రిలీజైన వారం వరకు ప్రమోషన్స్ చేసి అలసిపోయిన మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో జాలీ ట్రిప్ కు వెళ్లాడు. అయితే సినిమా సెకండ్ వీక్ లో ప్రమోషన్స్ చేయాలనే ఉద్దేశంతో సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రామవరం సెట్ దగ్గర నుండి.. న్యూయార్క్ లో సీన్స్.. డెహ్రాడూన్ లో కాలేజ్ సీన్ ఇలా అన్ని మేకింగ్ వీడియోలో పొందుపరిచారు. సినిమా ఇప్పటికే ప్రేక్షకుల మెప్పు పొందగా ఈ మేకింగ్ వీడియో మరింత నచ్చేస్తుంది. సినిమాకు సంబందించిన ప్రతి సీన్ ఈ మేకింగ్ వీడియోలో ఉండటం విశేషం. 2:50 నిమిషాలు ఉన్న ఈ మేకింగ్ వీడియోలో వంశీ పైడిపల్లి యాక్షన్ అని చెప్పిన మాట తప్ప మిగతా అంతా ఓ బిజిఎంతో నడిపించారు. మొత్తానికి సినిమా చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ మేకింగ్ వీడియోని చూసి కూడా సర్ ప్రైజ్ ఫీల్ అవడం ఖాయం.   





Related Post

సినిమా స‌మీక్ష