అమేజాన్ ముందే ఖర్చీఫ్ వేసిందా..!

May 20, 2019


img

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను, మహర్షి రెండు వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నాడు. కొద్దిపాటి గ్యాప్ తో మహేష్ అనీల్ రావిపుడి సినిమా చేస్తున్నాడు. జూన్ సెకండ్ వీక్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలాఉంటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే బిజినెస్ జరుగుతుందట. ముఖ్యంగా డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రాణిస్తున్న అమేజాన్ ప్రైం మహేష్ 26వ సినిమాను ముందే కొనేందుకు ఫ్యాన్సీ ఆఫర్ ముందుంచిందట.

మహర్షి సినిమా 11 కోట్లకు అమేజాన్ ప్రైజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమా కంటే ఎక్కువగా మహేష్ 26వ సినిమా రైట్స్ కొనుగోలు చేశారట. డైరక్టర్ ఫాం లో ఉన్నాడు.. మహేష్ డబుల్ ఫాంలో ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా హిట్ అనేస్తున్నారు. మరి మహేష్ 26 అంచనాలకు తగినట్టుగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష