ఆ సినిమా చేయాల్సింది కాదన్న స్టార్ హీరోయిన్

May 20, 2019


img

యాకర్ గా కెరియర్ మొదలు పెట్టి కోలీవుడ్ లో స్టార్ సినిమా ఛాన్సులు అందుకుంటున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఏదున్నా సరే మొహమాటం లేకుండా చెప్పేయడం అమ్మడి నైజం అనిపిస్తుంది. ఈమధ్యనే విజయ్ దేవరకొండతో తన పెళ్లంటూ వచ్చిన వార్తలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్యా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

ఇంతకీ ఐశ్వర్య రాజేశ్ చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరంటే చియాన్ విక్రం. ఆ సినిమా సామి-2. హరి డైరక్షన్ లో సామి సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఆ సినిమాలో ప్రాముఖ్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికి బాధపడుతున్న అని.. రెండు పాటలు రొమాంటిక్ సీన్స్ కోసమే ఆ సినిమాలో తనని పెట్టుకున్నారని.. ఇక మీదట అలాంటి సినిమాలు చేయనని చెప్పింది ఐశ్వర్య రాజేష్.

చేసిన సినిమా వల్ల జరిగిన నష్టం ఎలాగు జరిగిపోయింది.. ఇక మీదట అలాంటివి జరుగకుండా చూసుకుంటే బెటర్.. ఇప్పుడు విక్రం ఫ్యాన్స్ ఊరుకుంటారా ఐశ్వర్య మీద ట్రోల్స్ చేస్తారు. సో చేసిన సినిమా అది తప్పో ఒప్పో దాని గురించి మాట్లాడి అనవసరంగా అబాసు పాలవడం తప్ప మరోటి లేదు.  



Related Post

సినిమా స‌మీక్ష