రష్మిక యాక్టింగ్ సీక్రెట్ అదే..!

May 18, 2019


img

ఛలో సినిమాతో అలరించి గీతా గోవిందంతో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది కన్నడ భామ రష్మిక మదన్న. దేవదాస్ రిజల్ట్ తేడా కొట్టినా ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో దుమ్మురేపే రొమాన్స్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తుంది. తెలుగులో ఈ రేంజ్ ఫాలోయింగ్ అసలు ఊహించని అమ్మడు ఇంతటి అభిమానం ఇస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు తన యాక్టింగ్ సీక్రెట్ కూడా బయటపెట్టింది రష్మిక.

తాను బయట ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలానే చేస్తా అదే తన సీక్రెట్ అన్నది రష్మిక. ఇక తెలుగులో వరుస అవకాశాలు వస్తున్న ఈ టైంలో తను తెలుగు నేర్చుకుంటున్నానని.. సెట్ లో కూడా అందరిని తెలుగు మాట్లాడమని చెబుతున్నా అని చెప్పుకొచ్చింది అమ్మడు. సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి మూవీలో రష్మిక హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. అదే నిజమైతే రష్మిక కెరియర్ లో ఇదో గొప్ప అవకాశమని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష