నాని 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ ఎప్పుడంటే..!

May 18, 2019


img

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఆగష్టు 30న ఫిక్స్ చేశారు. జూన్ 30 వరకు సినిమా షూటింగ్ పూర్తి చేస్తారట. సినిమాలో నాని క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుందని అన్నారు డైరక్టర్ విక్రం కె కుమార్.

మైత్రి మూవీ మేకర్స్ ముందే ఈ రిలీజ్ డేట్ ప్రకటించడానికి కారణం ఆ రోజు మరే సినిమాతో క్లాష్ అవకూడదని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ గా కూడా అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి జెర్సీతో ఈ ఇయర్ హిట్ కొట్టిన నాని మళ్లీ గ్యాంగ్ లీడర్ తో సేం రిజల్ట్ అందుకుంటాడో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష